రాజకీయాలకిక శాశ్వత సెలవు
రాజకీయాలకిక శాశ్వత సెలవు పలికానని, బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ పార్టీని వదిలి రావడం ఇష్టం లేక ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగుతున్నానని ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మిత్రులు విశాఖలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, అవి మాట్లాడనని, వాటి జోలికి పోనని తెలిపారు. రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం మినహా మిగిలినవన్నీ సాధించగలిగానని, మరికొద్ది రోజులు కేంద్ర మంత్రిగా కొనసాగి ఉంటే మిగిలిన డిమాండ్లు కూడా పూర్తయి ఉండేమోనని తెలిపారు.













