జనంతో ఉండాలనే ఐదు రంగాలు ఎంచుకున్నా : ఉపరాష్ట్రపతి
సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, ఇతరులకు సాయపడుతూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ గేట్వే హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జనానికి దగ్గర చేసేలా ఉపరాష్ట్రపతి పదవి ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశానికి వెన్నెముక లాంటి రైతులు సవాళ్లను అధిగమించేలా చేయాల్సిన అవసరముందన్నారు. నిరంతరం జనంతో ఉండాలనే కోరికతో ఐదు రంగాలు ఎంచుకున్నానని చెప్పారు. ఇతరుల కోసం పనిచేస్తున్న సమాజా సేవకులను గౌరవించాలని చెప్పారు. ఈ సమావేశానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు హాజరయ్యారు.













