ఆ రెండూ తప్పే : ఉపరాష్ట్రపతి
నేర్చుకోవడం అనేది జీవితంలో భాగం కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. వాతావరణశాఖ, అధ్యయనం మరింతగా జరిగి రైతులకు, అన్ని వర్గాలకు ఉపయోగపడాలని అన్నారు. పరిశోధన లక్ష్యం, మానవాళి జీవన ప్రమాణాలు పెంచడమే పరమార్థంగా ఉండాలన్నారు. బ్లాక్ మనీని అరికట్టడం ప్రజా ఉద్యమం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి, సంస్కృతిని రక్షించుకోవడం ప్రజలు విధిగా భావించాలన్నారు. ఇదే సమయంలో హిందీ భాష వివాదంపై స్పందించిన ఉపరాష్ట్రపతి, హిందీ నేర్చుకోవాలని బలవంతం చేయడం, వ్యతిరేకించడం రెండూ తప్పేనని అన్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్లే వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు.













