విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా నామినేషన్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు కూటమి తరపున మేయర్ (Mayor) అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) నామినేషన్ దాఖలు చేశారు. తన కార్యాలయం నుంచి కూటమి నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆమోదంతో మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచానని, తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో పాటు నగరంలో ఎమ్మెల్యే సహకారంతో విజయవాడను అభివృద్ధి చేసి మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు.








