ఏపీకి రానున్న అమెరికా సంస్థలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పట్టేందుకు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అమెరికాకు చెందిన వివిధ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. సేంద్రీయ వ్వవసాయానికి ఆమ్వే సంస్థ ముందుకు రాగా, రాష్ట్రంలో ఒక్కోచిన్నారికి రూ.150కే నియోనియా వ్యాక్సిన్ వేస్తామని ఫైజర్ సంస్థ వెల్లడించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ప్రతినిధి బృందం సమావేవమైంది. రాష్ట్రంలో తామంతా అడుగుపెట్టేందుకు సిద్ధంగా వున్నామని ఫోరం ప్రతినిధులు ముఖ్యమంత్రికి పలు ప్రతిపాదనలను సమర్పించారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టేందుకు ఆయుర్వేద ఉత్పత్తులలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆమ్వే సంస్థ తమకు 500 ఎకరాలు కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే తాము కర్నాటకలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు వివరించారు. కుప్పంలో సేంద్రీయ సాగుపై ముందుగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడి రహిత సేంద్రీయ వ్యవసాయానికి కృషి చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న సుభాష్ పాలేకర్‌తో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
నిమోనియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యాక్సినేషన్ వేసేందుకు ఫైబర్ సంస్థ సన్నద్ధంగా వుంది. ప్రపంచ వ్యాప్తంగా యూనిసెఫ్‌తో కలిసి వ్యాక్సినేషన్ కాక్యక్రమం చేపట్టమని ఫైబర్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఒక్కోడోను రూ.4వేలు విలువైన వ్యాక్సిన్‌ను రూ.150కే వేసేందుకు సిద్ధమని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఏపీలో నిమోనియా బాధిత చిన్నారులువున్నందున తక్షణమే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు.













