సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ
కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను తన కార్యాలయానికి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్ ఆయనకు జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం సీఎం జగన్ కేంద్ర మంత్రి మాండవీయులు కొద్ది సేపు భేటీ అయ్యారు. కేంద్ర సహకారంలో వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు. అనుహ్యమై రీతిలో వైద్య ఆరోగ్య సేవలు రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయని మాండవీయ జగన్తో అన్నారు. ఇది నిజంగా అద్భుతమన్నారు. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కీలకంగా ఏపీలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.













