Nirmala Sitharaman: ఏఐ శిక్షణ తీసుకోవాలంటే లంక రావాల్సిందే : నిర్మలా సీతారామన్
రాష్ట్రంలో యువత ఏఐ శిక్షణ తీసుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవాని (పీఎం) లంక రావాల్సిందేనని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పీఎం లంకలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ముందుగా డిజిటల్ భవనంలో ఏర్పాటుచేసిన సైయెంట్ ఏఐ (AI), ఫ్యూచర్ స్కిల్‌హబ్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడుతూ మహిళల (Women) మద్దతుతోనే ఈ గ్రామంలో అభివృద్ధి సాధ్యమైందని, ఆంధ్ర (Andhra) కోడలిగా పీఎం లంక కుమార్తెగా తనను ఆదరిస్తున్నారన్నారు. మహిళలు, రైతులు, యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మోడల్ ఏఐ అధారిత నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉన్న స్మార్ట్ తరగతి గదులు, డ్రోన్ శిక్షణ పరికరాలు, ఓపెన్‌సోర్స్ ఏఐ సాధనాలు, రియల్ టైం ట్రాకింగ్, కేంద్రీకృత అభ్యసన నిర్వహణ వ్యవస్థ ద్వారా నైపుణ్యాలు పెంచవచ్చు. ప్రధాని మోదీ ఆలోచనతోనే తూర్పుతాళ్లు, పీఎం లంక గ్రామాలను దత్తత తీసుకున్నా అని అన్నారు.






