High Court : హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది గేదెల తుహిన్ కుమార్ (Gedela Tuhin Kumar) నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఆయన నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. సీజేఐ బీఆర్.గవాయ్ (BR Gavai) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న సమావేశమై, తుహిన్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court ) కు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర హైకోర్టులో 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది. అదనపు న్యాయమూర్తులతో కలుపుకొని ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులు (Judges) ఉన్నారు. తుహిన్ నియామకంతో ఈ సంఖ్య 30కి చేరనుంది.