TTD: టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే… క్రిమినల్ చర్యలు : భానుప్రకాశ్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల క్షేత్రంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం మంచిదికాదని చెప్పారు. ఫేక్ ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అధ్యక్షతన జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో రెండు సార్లు టీటీడీ చైర్మన్‌గా, మూడు సార్లు బోర్డు సభ్యుడిగా పనిచేసిన భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) కి స్కూటర్ (Scooter) తాళాలు, ఆలయం గేటు తాళాలకు వ్యత్యాసం తెలియదా? అని నిలదీశారు. చంద్రగ్రహణం రోజున మహాద్వారం ముందున్న గ్రిల్స్‌కు తాళాలు వేసింది ఓ ఛానల్ ప్రతినిధి కాదని, టీటీడీ సిబ్బందేనని తెలిపారు. వైసీపీ నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా భక్తులు నమ్మరన్నారు.