30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈ నెల 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మూెత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను తిరుపతిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వేడుకగా నిర్వహించనున్నట్టు, సీఎం జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పిస్తారని వెల్లడించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, జేఈవో బసంత్‌కుమార్, సీవీఎస్కో గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.













