ఆ నిర్ణయంతో మంచి ఫలితం
తిరుమలలో ఎల్1, ఎల్2 దర్శనాలు రద్దుతో మంచి ఫలితం వచ్చిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజూ సుమారు రెండు గంటల సమయం అదనంగా సామాన్య భక్తులకు లభిస్తుందన్నారు. తిరుమలలో అశ్విని ఆసుపత్రికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన తనిఖీల నిర్వహించారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పాలకమండలి పూర్తి స్థాయిలో నియమించిన తర్వాత గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. ఇక ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఎల్1, ఎల్2 దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అమలు చేస్తామని పేర్కొన్న సంగతి విధితమే.













