అత్యంత వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
దేవదేవుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం తిరుమల
అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయం ఇదొక్కటే
ఒక రోజు రికార్డు కలెక్షన్ రూ. 5.73 కోట్లు
ఏడుకొండలపైన స్వయంభువుగా వెలసిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల గురించిన ఆసక్తికర విశేషాలివి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయం తిరుమల శ్రీవెంకటేశ్వరాలయం. వెంకన్న పేరిట తక్కువలో తక్కువగా 4,500కు పైగా ఎకరాల భూమి రిజిస్టరై ఉంది.
వివిధ బ్యాంకుల్లో రూ. 9,500 కోట్ల డిపాజిట్లు ఉండగా, ఏటా రూ. 800 కోట్ల వడ్డీ వస్తోంది.
హుండీ నుంచి రోజుకు సుమారు రూ. 3 కోట్లు వస్తుంది.
ఒక రోజు రికార్డు కలెక్షన్ రూ. 5.73 కోట్లు.
నిత్యమూ తిరుమలలో జరిగే వ్యాపారం విలువ రూ. 2 కోట్లు. టోపీలు, ఫోటోల వ్యాపారమే రూ. 70 లక్షల వరకూ ఉంటుందని అంచనా.
స్వామివారికి రోజూ 120 రకాల ఆభరణాలతో అలంకారం.
స్వామికి అలంకరించే బంగారు పీతాంబరం బరువు 40 కిలోలు.
స్వామి వద్ద అత్యంత అరుదైన గరుడమేరు పచ్చ ఉంది. ఉత్సవాల్లో మాత్రమే దీనిని అలంకరిస్తారు.
స్వర్ణ రథం తయారీకి 74 కిలోల బంగారాన్ని వాడారు.
నిత్యమూ 7 కిలోల వరకూ బంగారం, వెండి కానుకలు స్వామి హుండీలో చేరుతాయి.
ఆసియాలో అతిపెద్ద వంటశాల తిరుమలలో ఉంది.
రోజుకు లక్ష మంది ఇక్కడ అన్న ప్రసాదాన్ని తీసుకుంటారు.
స్వామి అలంకరణ కోసం రోజూ 15 వేల కిలోల పూలు దేశ విదేశాల నుంచి వస్తాయి.
200 మంది ఈ పూలను కట్టి స్వామి వారికి సహా, పలు వసతి భవనాలు, కాటేజీల్లో అలంకరణకు వాడుతారు.
నిత్యమూ నాలుగు లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తుంటారు.
24 గంటలూ తెరచివుండే కల్యాణ కట్టలో 700 మంది క్షురకులకు విధులు.
గత సంవత్సరం తలనీలాల ఆదాయం రూ. 150 కోట్లు.
స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించేందుకు రోజుకు 90 మందికి విధులు.
స్వామివారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల బరువు 13 వేల కిలోలకు పైగానే.













