ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టారు.. బుద్ధి మార్చుకోవాలన్న చంద్రబాబు
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దీనికి వైసీపీనే కారణమని అన్నారు. మహానుభావులను గౌరవించాలన్న మంచి గుణానికి వైసీపీ మొదటి నుంచి దూరంగా ఉందని, ఇకనైనా ప్రభుత్వం తన వక్రబుద్ధి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. అంతేకాకుండా మొదటి నుంచి సంస్థలకు ఉన్న మహానుభావులను పేర్లను, వారి విగ్రహాలను వైసీపీ ప్రభుత్వం తొలగిస్తూ వస్తోందని, ఇప్పుడు క్యాడర్ కూడా అదే దారిలో ప్రయాణిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇవన్నీ టార్గెట్ చేసి కావాలనే చేస్తున్న చర్యలని, తమ అధికారాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ఇకపై ఇటువంటి చేష్టలను టీడీపీ ఏమాత్రం సహించదని అన్నారు.













