ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామన్నారు. అభివృద్ధి, కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్పోర్టులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయ పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఇటీవల అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.













