Balakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..

ఏపీ రాజకీయ వేదికపై గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అసెంబ్లీ (Assembly)లో చేసిన వ్యాఖ్యలు ప్రధాన చర్చగా మారాయి. గత వారం సెప్టెంబర్ 25 (September 25) న జరిగిన అసెంబ్లీ చర్చలో హిందూపురం (Hindupur) ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానంగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి (Jagan Mohan Reddy) ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తావనపై కూడా ఆయన కొంచెం కఠినంగా స్పందించారు. ఈ ప్రవర్తనకు వెంటనే వైసీపీ (YSRCP) ప్రతిక్రియ ఇచ్చింది. అసెంబ్లీ లో జరిగిన ఈ వాదనతో బాలకృష్ణపై సోషల్ మీడియా (Social Media) హాట్ టాపిక్ (Hot Topic) గా మారింది. ఇటు వైసీపీ కార్యకర్తలు అటు సోషల్ మీడియాలో ఉత్సాహం చూపుతున్న ప్రజలు, బాలకృష్ణను బూచిగా చూపిస్తూ టీడీపీ (TDP) , జనసేన (Jana Sena) మధ్య పొత్తు సంబంధాన్ని కొద్దిగా దెబ్బతీస్తే ప్రయత్నంలో ఉన్నారని అనుమానిస్తున్నారు.
ఈ కేసులో అధికార కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన వెంటనే సమన్వయ చర్యలు చేపట్టాయి. ఎలాంటి అవకాశాన్ని విపక్షానికి ఇచ్చొద్దని నిర్ణయించుకుని, వైసీపీ ప్రతిక్రియలపై భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో కూడా వైసీపీ ప్రతికూల ప్రచారాన్ని తగ్గించకపోవడం రాజకీయ రంగంలో ఆసక్తికరంగా మారింది. బాలయ్య అభిమానులు కూడా స ఈ వివాదంపై జోరుగా స్పందిస్తూ సోషల్ మీడియా వార్ స్టార్ట్ చేశారు.
మధ్యలో మెగాస్టార్ చిరంజీవి , ఆయన అభిమానులు పరిస్థితిని గమనిస్తూ, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. కానీ జనసేన నుంచి ఇప్పటివరకు ఏ విధమైన ప్రకటన రాలేదు. అసెంబ్లీ లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు స్పందించకపోవడం వైసీపీ బలంగా మారింది. ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.
మరోపక్క వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో కూటమి ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని గౌరవించకపోవడం, అవమానానికి పాల్పడినట్టు ప్రస్తావిస్తోంది. ఈ వివాదం ఐదు రోజులుగా కొనసాగుతున్నా, జనసేన సీరియస్ గా సంయమనం చూపుతూ, వివాదాన్ని పెద్దదిగా కాకుండా చూడటంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తోపాటు ఎమ్మెల్సీ నాగబాబు (MLC Nagababu) కూడా వివాదం మరింత వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ పరిస్థితులన్నింటితో బాలకృష్ణ అసెంబ్లీ ఎపిసోడ్ ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్ (Trending) లో కొనసాగుతోంది. వైసీపీ ఎంతగా ట్రై చేసినా, జనసేన జాగ్రత్తగా వ్యవహరించడం, ప్రధాన నేతలు స్పందించకపోవడం ఈ వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నపటికి. పెద్ద ఫలితం మాత్రం లేదనే చెప్పాలి. ఇక వైసీపీ నేతలు ఒక చిన్న చర్చ విషయానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రజల సమస్యలను వివరించడానికి ఇస్తే బాగుంటుందని కొందరు తమ అభిప్రాయాన్ని నేరుగా వ్యక్తికరిస్తున్నారు. మొత్తానికి బాలయ్య ఎపిసోడ్ ని వైసీపీ ఎప్పుడు వదిలిపెడుతుందో చూడాలి..