పోలవరాన్ని రాజకీయం చేయకండి
పోలవరం ప్రాజెక్టు అభివృద్ధితో కూడుకున్న అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. ఈ అంశంపై రాజకీయం చేయొవద్దని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. ఆయన టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసే సమస్యే లేదని ఆయన సృష్టం చేశారు. పోలవరం నిర్మాణం, అభివృద్ధికి సహకరించడం కేంద్ర బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని విమర్శిస్తూ ఏదో ఒకటి మాట్లాడొద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఆంథ్రప్రదేశ్ అత్యధిక వృద్ధిరేటు సాధించినప్పటికీ, విభజన సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పోలవరంపై కేంద్రం రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి గడ్కరీతో చర్చిస్తామని పేర్కొన్నారు.













