విజయవాడ వరదలో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న గవర్నమెంట్..
ఆంధ్రాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల (Heavy rains) కారణంగా విజయవాడ వరద (Vijayawada floods) బీభత్సాన్ని ఎదుర్కొంది. విజయవాడ తో పాటు చుట్టుపక్కలప్పలు జిల్లాలు జలమయం అవ్వడంతో ఇంటిలోని సామాన్లతో పాటు విద్యార్థులు ఎంతో విలువైన సర్టిఫికెట్లు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ పత్రాలు లాంటి ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నీటిపాలై పాడైపోయాయి. తిరిగి మళ్ళీ ఈ సర్టిఫికెట్లు చేయించుకోవడం అంతే అంత ఆషామాషీ విషయం కాదు. రోజుల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడంతో పాటు డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
అయితే ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం దీనికి కూడా ఓ మంచి పరిష్కారాన్ని సూచించింది. విలువైన డాక్యుమెంట్లు వరద కారణంగా కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇదే విషయాన్ని అన్ని శాఖలకు తెలియపరుస్తూ ఆదేశాలను కూడా పంపింది. దీనికోసం ఓ స్పెషల్ డ్రైవ్ ని కూడా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోందని టాక్.
ఇక వరదలోతమ సర్టిఫికెట్లను పోగొట్టుకున్న విద్యార్థులకు సంబంధించి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh).. వరదలో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి తక్షణమే సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు భవిష్యత్తులో తమ సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పూర్తిస్థాయిలో డిజి లాకర్స్ (Digi lockers) సిద్ధం చేయించాలని సూచించారు. ఈ ఏర్పాటు చేయడం వల్ల పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా ఎక్కువ సమయం పట్టదని ఆయన పేర్కొన్నారు.
వరద బీభత్సం మొదలైన నాటి నుంచి విజయవాడ వాసులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ( Kutami )అన్ని విధాల వారికి చేయూతనందించడానికి ప్రయత్నిస్తోంది. కని విని ఎరుగని భారీ రీతిలో నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రభుత్వం వాటిని ప్రజలకు అందించే ఏర్పాట్లను కూడా చేస్తుంది. అర్హులకు కచ్చితంగా వరద సహాయం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అర్హత ఉండి కూడా పరిహారం అందని వారి జాబితాను సిద్ధం చేసి వారికి పరిహారం అందేలా చేస్తామని అన్నారు. ఈరోజు విజయవాడ వరద సందర్భంగా నష్టపోయిన ఎందరికో ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించబోతోంది.













