బీసీలు రాజకీయంగా ఎదగడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేదు : మంత్రి సవిత
బీసీ (BC)లు రాజకీయంగా ఎదగడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేదని అందుకే హైకోర్టు (High Court)లో వ్యాజ్యాలు చేసి స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల వారికి 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Savitha) ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటపై నిలబడుతుందని, హైకోర్టు తీర్పు గౌరవిస్తూనే సుప్రీంకోర్టు (Supreme Court)లో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తే జగన్ (Jagan)కు రాజకీయ సమాధి కడతారని మండిపడ్డారు.








