రాయలసీమలో నేడు చారిత్రాక ఘట్టానికి శ్రీకారం చుట్టనున్న కూటమి ప్రభుత్వం
ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమ లో రూ. 1 లక్ష కోట్ల ప్రణాళికతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్-GHHకు శ్రీకారం చుడుతున్న ఎన్డీఏ సర్కారు
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం రూ.40,352 కోట్ల వ్యయం చేయనున్న ప్రభుత్వం
ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్లు పెట్టుబడులు రాబట్టేలా ప్రణాళికలు
మదనపల్లెలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా GHHకు అంకుర్పారణ
చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరు కానున్న మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు
సీడ్ టు షిప్ మెంట్ విధానంలో ఉద్యాన రైతులకు అండగా నిలిచేలా ప్రతిష్టాత్మక GHH కు రూపకల్పన.
ఉద్యాన రైతులకు మేలు కలిగేలా వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టనున్న కూటమి ప్రభుత్వం
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు కోసం దాదాపు 6 నెలల నుంచి పెద్ద ఎత్తున కసరత్తు చేసిన సీఎం చంద్రబాబు
వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, ఇరిగేషన్ సహా వివిధ కీలక శాఖలతో సమీక్షలు సహా కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి
రాయలసీమ పరిస్థితులను అర్థం చేసుకుని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు నిధులు సమకూర్చేందుకు కేంద్రం అంగీకారం
ఉద్యాన సాగు విస్తరణ, పంట దిగుబడి మొదలుకుని ఎగుమతుల వరకు జరిగే వివిధ ప్రక్రియలను బలోపేతం చేసేలా GHH కు ప్రణాళిక
పండ్ల ఎగుమతి, ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు వంటి అంశాలపై యూఏఈతో రెండు నెలల క్రితమే ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
• అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద అభివృద్ధి పనులు చేపట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వం.
•10 జిల్లాల్లోని 303 మండలాల్లో ఉన్న 5,869 గ్రామాలను 201 క్లస్టర్లు గా అభివృద్ధి పనులు.
• ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లల్లో ఉన్న హార్టికల్చర్ సాగును మరో 6 లక్షల హెక్టార్ల కు విస్తరించి మొత్తం 14.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగును పెంచేలా ప్రణాళికలు.
• ప్రస్తుతం 222 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న హార్టికల్చర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 435 లక్షల మెట్రిక్ టన్నులకు చేర్చేలా లక్ష్యం నిర్దేశించుకున్న ప్రభుత్వం.
• హార్టికల్చర్ హబ్ ద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం.
• కొత్తగా 9 లక్షల ఎకరాల ఆయకట్టు.. 4.3 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసేలా చర్యలు.
• 3దశలు..6 ప్యాకేజీలు గా గ్లోబర్ హార్టికల్చర్ హబ్ పనులు చేపట్టనున్న ప్రభుత్వం.
• 2029 జూన్ నాటికి GHH పనులు పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్దం చేసిన ప్రభుత్వం.
అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున సాగునీరు, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను చేపట్టనున్న ప్రభుత్వం
రహదారులు, లాజిస్టిక్స్ అభివృద్ధి పనులకూ GHHలో ప్రాధాన్యత
ప్రభుత్వం వ్యయం చేయనున్న రూ.40,352 కోట్లలో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యాన అభివృద్ధికి రూ.15 వేల కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్లు కేటాయింపు చేసేలా ప్రణాళిక
• నల్లమలసాగర్ నింపడం, వెలిగొండ ఫేజ్-2 పనులు పూర్తి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి పనులు చేపట్టేలా ప్రణాళికలు.
• మైనర్ ఇరిగేషన్ చెరువుల పునరుద్దరణలో GHH పనుల్లో ప్రాధాన్యం.
•కమతాలను మార్కెట్లను అనుసంధానించే లా 5721 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం.
• రైస్ బౌల్‌గా పేరొందిన ఏపీకి… ఫ్రూట్ బౌల్ కీర్తి సాధించిపెట్టేలా రాయలసీమ హార్టికల్చర్ హబ్ రూపకల్పన.
• మామిడి, అరటి, టమోటా, దానిమ్మ , డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బెర్రీ ప్రధాన పంటలకు ప్రొత్సాహం.
• వివిధ పంటలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెస్ ప్లాంట్ల ఏర్పాటు.. ఎగుమతుల్లో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు.
• FPOలను ప్రాసెసింగ్ యూనిట్లతో అనుసంధానించి రైతులకు ప్రయోజనాలు చేకూర్చేలా GHH ప్రాజెక్ట్ రూపకల్పన.
రాయలసీమ రైజింగ్‌లో భాగంగా మదనపల్లెలోనే మరో కీలక ప్రాజెక్టుకు అంకురార్పణ చేయనున్న కేంద్ర ఆర్థిక మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం
వ్యవసాయ, అనుబంధ రంగాల్ని లాభసాటిగా తీర్చిదిద్దేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ISA ఏర్పాటుకు శంకుస్థాపన
ISA శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కానున్న రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ
పారిశ్రామికాభివృద్ధికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో వ్యవసాయాభివృద్ధికి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు
మదనపల్లెలో భారతదేశ తొలి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికకల్చర్ ఏర్పాటు చేయనున్న కూటమి ప్రభుత్వం
సీఎం చంద్రబాబు సూచనలతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు.. నిర్వహణకు ముందుకు వచ్చిన రిలయన్స్ సంస్థ
• వ్యవసాయ రంగంలో సవాళ్లకు పరిష్కారం చూపేలా రైతులకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపెట్టేలా వ్యవహరించనున్న ఐఎస్ఏ.
• ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ అధ్యయనం, డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, క్రాప్ మానిటరింగ్, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై రైతులకు సలహాలు అందించనున్న అగ్రికల్చర్ స్కూల్.
• ఉద్యాన, వ్యవసాయ రంగాల్లో డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేసేలా రైతులకు సలహాలివ్వనున్న ISA.
• వ్యవసాయరంగంలో స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం, ఇంక్యుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.








