టీటీడీ చైర్మన్‌గా సుధాకర్ యాదవ్!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, మైదుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను వరించనున్నట్లు తెలిసిది. టీడీపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్న టీటీడీ పాలకమండలి పదవీ కాలం కొంత కాలం క్రితం ముగిసింది. ఇంతవరకూ కొత్త పాలకమండలిని నియమించలేదు. చైర్మన్ పదవిని అనేక మంది కోరుతుండడంతో ఎవరికి ఇవ్వాలన్న మీమాంసలో నియామకం వాయిదావేస్తూ వచ్చారు. ఈ పదవిని ఈసారి బీసీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఈ దిశగా జరిపిన అన్వేషణలో చివరకు సుధాకర్ యాదవ్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.













