తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రెండు స్థానాలకు గాను సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎం రమేష్ ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, కనకమేడల రవీంద్రకుమార్ తెదేపా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్ కు మళ్ళీ అవకాశం కల్పిస్తుండగా మరో అభ్యర్ధిగా సీనియర్ న్యాయవాది, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌ను ప్రకటించారు. తొలుత సీఎం రమేష్, వర్ల రామయ్య పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే… మారిన సమీకరణాల నేపధ్యంలో వర్ల రామయ్య స్థానంలో కనకమేడల రవీంద్రకుమార్ పేరు తెరపైకి వచ్చింది. అనంతరం వీరిద్దరి పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు.













