ఉపరాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎంపీలు, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. విభజనచట్టం అమలు, కడపలో స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి టీడీపీ బృందం తీసుకెళ్లింది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా చొరవ తీసుకోవాలని ఎంపీలు వినతి చేశారు.
అనంతరం ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం అమలు, కడప స్టీల్ ఫ్లాంట్ అంశాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కడపలో ఉక్కుపరిశ్రమకు అనుకూలమైన ప్రదేశమని, విద్యుత్ సదుపాయం, ఐరన్ అన్ని ఉన్నాయని తెలిపారు. అందరం కలిసి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిని కలిసేందుకు వైసీపీ నేతలను కూడా ఆహ్వానించామని తెలిపారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుకావడం వైసీపీకి ఇష్టం లేదని విమర్శలు గుప్పించారు.













