ఎంపీ మిథున్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి: ఎంపీ సానా
తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే రాయలసీమ (Rayalaseema)లో వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీశ్ ( Sana Satish) ఆరోపించారు. కిరాయి రౌడీలను తీసుకొచ్చి టీడీపీ ( TDP) నేతలను ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. పుంగనూరులో కార్లతో చేసిన అరాచకాలపై జగన్ ఏం సమాధానం చెబుతారు? పులివెందులలో సాగిస్తున్న అరాచకాలపై గవర్నర్కు వివరిస్తారా? ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy)పై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలి. వైసీపీ ఎంపీల అరాచకాలతో దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోతోంది. స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవరకు జగన్ (Jagan) కదలికలపై నిఘా పెట్టాలి అని డిమాండ్ చేశారు.








