నా రాజీనామాకు కారణం ఇదే
తెలుగుదేశం పార్టీ ఎంపీ అశోక్‌గజపతి రాజు తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని అన్నారు. ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీకి కేంద్రం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల అమలు చేయలేదని, హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారని, అది కూడా సరిగా అమలు చేయలేదని, అందుకే తన మంత్రి పదవికీ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన కోరారు













