ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే : బుద్ధ వెంకన్న

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టేందుకు గుడికి బయలుదేరిన టీడీపీ నేత బుద్ధ వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్టు చేసిన బుద్దా వెంకన్నను తీసుకెల్లే సమయంలో పోలీస్ జీపులకు తన వాహనాలను అడ్డుపెట్టి టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్నకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. దుర్గగుడికి వెళ్లేందుకు తమ అనుమతి కావాలంటూ పోలీసులపై వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సంబంధించిన నిరసన కార్యక్రమాలను పోలీసులే కావాలని నీరుగారుస్తున్నారని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. అమ్మవారికి కొట్టవలసిన క్బొరికాయలను పోలీసులు ముందు కొట్టి నిరసన తెలిపారు.











































































