కొవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న ఎమ్మెల్యే గద్దె దంపతులు
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి గద్దె అనురాధ కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ నియంత్రణకు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ తొలి ట్రయల్లో భాగంగా వీరిద్దరూ గత నెల 7వ తేదీన మొదటి డోసు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 రోజుల తర్వాత వారు రెండో డోసు టీకా తీసుకున్నారు. ప్రయోగాత్మక వ్యాక్సిన్ తీసుకున్న తమకు అంతా బాగానే ఉందని, ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ దంపతులు తెలిపారు. త్వరలోనే అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని వారు ఆకాంక్షించారు.













