ఈ నెల 31న విశాఖపట్నంలో టీడీపీ భారీ బహిరంగ సభ
తెలుగుదేశం పార్టీ ఈనెల 31న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది – పశ్చిమబంగ్ల, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ దీనికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు – మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొనే అవకాశముంది – ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో ఈసారి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ నెలకొంది – విశాఖపట్నం లోక్‌సభకి టీడీపీ నుంచి దివంగత మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి మనమడు శ్రీభరత్, వైసీపీ తరఫున సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు – మొదటి నుంచీ ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట – ఇక్కడ పోలింగ్‌కి ముందు భారీ స్థాయిలో బల ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో బహిరంగ సభ నిర్వహించబోతోంది – విభజన చట్టం, ఇతర హామీల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్న టీడీపీ ఎన్నికల షెడ్యూల్‌కి ముందు అమరావతిలో భారీ స్థాయిలో ధర్మపోరాట దీక్ష పేరిట సభ నిర్వహించాలని మొదట భావించింది. మొదటి దశలోనే రాష్ట్రంలో పోలింగ్ ఉండటంతో దానిని విరమించుకుంది.













