అట్టహాసంగా ఆరంభమైన మహానాడు
తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పెద్ద పండుగగా భావించే మహానాడు ఘనంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సిద్థార్థ కళాశాల్లో ఈ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. అంతకుముందు మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు డ్వాక్రా బజార్, ఫోటో ప్రదర్శన ప్రారంభించి, తిలకించారు. ఆనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలను అభినందించారు. ఈ పసుపు పండుగ మూడు రోజుల పాటు జరగనుంది. కేంద్రంపై తన పోరాట పంధాను మరింత సృష్టంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ దీనిని వేదికగా చేసుకోనుంది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు కావడంతో ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది. వచ్చే సంవత్సరకాలంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ప్రదాన లక్ష్యంగా నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.













