అప్పుల కోసం హైరానా పడుతుంటే. .. జిల్లాకో విమానాశ్రయం ఎలా సాధ్యం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే జిల్లాలో విమానాశ్రయం ఎలా సాధ్యం అవుతుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పుల్లో ఉంటే జిల్లాలో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలిస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాల్జేశారని, ఉద్యోగులు, పింఛనుదారులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గతేడాది శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలలు ఏమయ్యాయని నిలదీశారు. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలాన్ని నేటి వరకూ కేటాయించకపోవడం అన్యాయమన్నారు. ఎప్పటి నుంచో పెండిరగులో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్నింటి కంటే ముందు కృషి చేయాలని డిమాండ్ చేశారు.













