టీడీపీ కీలక నిర్ణయం.. పిఠాపురం ఇన్ చార్జి కి షాక్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ఎస్వీఎస్ వర్మ (SVS Varma) ను తొలగిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) వర్మకు ఫోన్ చేసి అధిష్ఠానం నిర్ణయాన్ని తెలియజేశారు. కూటమి ఐక్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీని నష్టపరిచే చర్యలను నేను సహించలేకపోయాను. అంతేతప్ప నాకు కూటమిలోని పార్టీలతో ఎలాంటి వ్యక్తిగత విభేదాల్లేవు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అని వర్మ, పల్లాకు స్పష్టం చేశారు.
గత కొద్ది రోజులుగా పిఠాపురంలో జనసేన నాయకులు, వర్మకు నడుమ తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దీన్ని సీరియ్స గా తీసుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది. వర్మ స్థానంలో నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను త్రీమెన్ కమిటీకి అప్పగించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. త్వరలోనే త్రీమెన్ కమిటీని నియమిస్తామని పల్లా తెలిపారు.
ఇవి కూడా చదవండి







