తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్దులకు దుప్పట్లు, ఆక్సీజన్ కన్సన్ట్రేటర్స్ పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి సౌజన్యంతో దెందులూరు మాజీ శాసనసభ్యులు శ్రీ చింతమనెని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రామశింగారం గ్రామం నందు వృద్దులకు రాజా కసుకుర్తి సమకూర్చిన చలి దుప్పట్లు, పండ్లు, ఆక్సీజన్ కన్సన్ట్రేటర్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శ్రీ చింతమనెని ప్రభాకర్ గారు మాట్లాడుతూ పేదలకు, వృద్దులకు సేవ చేయడంలో తానా ఎప్పుడు ముందు ఉంటుంది అని, తెలుగు ప్రజలకు సెవ చెయటానికి తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి మరియు ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ గార్ల నాయకత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలని అమలు చెస్తునారు అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రామశింగారం గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు గారు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.













