Chandrababu : అక్టోబరు 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో : సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. కాకినాడ (Kakinada) జిల్లా పెద్దపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర`స్వచ్ఛాంద్ర సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రత. గత వైసీపీ ప్రభుత్వం (YSRCP government) చెత్తపై పన్ను వేసింది గానీ, చెత్త మాత్రం తీయలేదు. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అక్టోబరు 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం తొలగిస్తాం. గత ప్రభుత్వంలో అరాచకాన్ని సృష్టించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి, ఆరోగ్యంగా ఉండాలనేదే నా ఏకైక కోరిక. మన ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏదీ వృథా కాదు, చెత్త నుంచి సంపద సృష్టించొచ్చు. ఈవేస్ట్‌ను రీసైక్లింగ్‌కు పంపేలా ఆలోచనలు చేస్తున్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పెద్దాపురం (Peddapuram) లో 100 పడకల ఆసుపత్రి (hospital) ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.