బాబుకి జీవో షాక్ తప్పదా…? కుప్పంలో ఏం జరుగుతుంది…?
ఆంధ్రప్రదేశ్ లో సభలు, ర్యాలీలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపధ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం టూర్ పై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన చంద్రబాబు కాసేపట్లో బెంగళూరు ఎయిర్ పోర్ట్ కి అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం రెండు గంటలకు శాంతిపురం మండలం పెద్దూరు చేరుకుంటారు. కుప్పం నుంచి శాంతిపురం వెళ్తున్న నాయకులను,, ప్రచార రథంను , వాహనాలను,, కార్యకర్తలను, అభిమానులను అడ్డుకొని పోలీసులు వెనక్కు పంపుతున్నారు.
శాంతిపురం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… చంద్రబాబు పాల్గొనబోయే శాంతిపురం మండలం పెద్దూరు గ్రామంలో ఆంక్షలు విధించారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా ప్రచార రథాన్ని సిద్ధం చేయటానికి శుభ్రం చేస్తున్న క్రమంలో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించడం సంచలనంగా మారింది. ఇక గుడిపల్లి పోలీస్ స్టేషన్ కు వాహనాలను తరలించారు. వాహన డ్రైవర్ తో సహా సహాయక సిబ్బంది ని అదుపులోకి తీసుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం చంద్రబాబు టూర్ పై ఆశలు పెట్టుకున్నారు.
శాంతిపురం మండల పరిధిలోని చంద్రబాబు పర్యటించే గ్రామాలలో భారీగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేనుమాకులపల్లిలో ఏర్పాటు చేసిన స్టేజ్ ను కూడా పోలీసులు తొలగించడంపై మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసిపి నేతలు లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వైసీపీ కండువా కప్పుకుంటే మంచిందన్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనంను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు… డ్రైవర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే టీడీపీ నేతలు లేఖ కూడా ఇచ్చారు.













