ఆర్-5 జోన్ వ్యవహారంపై… సీజేఐకి రిఫర్ చేసిన సుప్రీం
రాజధాని అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్ వ్యవహారంపై రైతులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం సీజేఐకి రిఫర్ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. అమరావతిపై పిటిషన్ల విచారణను మరో బెంచ్ చూస్తోందని, అలాంటప్పుడు తాము విచారించడం సరికాదని అభిప్రాయపడింది. అమరావతి ప్రధాన కేసుతో పాటు ఆర్-5 జోన్ కేసునూ కలిపి విచారించడమే సబబని ధర్మాసనం అభిప్రాయపడింది. శుక్రవారంలోపు ఈ పిటిషన్లపై విచారణకు సంబంధిత ధర్మాసనం ముందు లిస్ట్ చేసేందుకు అనుగుణంగా సీబీఐ నుంచి తగిన సూచనలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెండు పిటిషన్లనూ ఒకే ధర్మాసనం విచారించాల్సి ఉన్నందున ఆ మేరకు వ్యవహరించాలని జస్టిస్ అభయ్ ఎస్.ఓకా సూచించారు.













