శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీవేంకటాద్రిరాముని అవతారంలో శ్రీవారు కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని పండితులు నిర్వమించారు. కార్యక్రమంలో శ్రీపెద్దజీయర్స్వామి, శ్రీచిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, అధికారులు పాల్గొన్నారు.













