Advisors : రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నలుగురు ప్రముఖులు
వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ సలహాదారులు (Advisors)గా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్(Sridhara Phanikkar Somnath), ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్ రెడ్డి (Satish Reddy), చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల (Suchitra Ella), ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీ (KPC Gandhi) లను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు ఆ పదవుల్లో ఉంటారు.













