దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత సంక్షేమం లేదు: CM
దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత సంక్షేమం లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలైంది ఏపిలోనే.
పెన్షన్లు 10రెట్లు పెంచడం ఒక చరిత్ర. పించన్ నెలకు రూ.2వేలు అందిస్తున్నాం.
పసుపు-కుంకుమ ద్వారా మహిళల్లో ఆనందం. రూ.24వేల కోట్లు మహిళలకు అందించాం. ప్రతి మహిళకు 2దశల్లో రూ.20వేలు ఇచ్చాం. 5లక్షల మంది యువతకు ముఖ్యమంత్రి యువనేస్తం. ప్రతి నెలా యువతకు రూ.2వేలు ఇస్తున్నాం.
మన అన్న కేంటిన్లు ఆకలి తీర్చడమే కాదు. ఆత్మగౌరవానికి ప్రతిబింబాలు. పరిశుభ్రతకు మారుపేరు.
సంపద పెంచాం, పేదలపై భారం పడకుండా చూశాం. పారదర్శక పాలన అందించాం
కేంద్రం సహకారం లేదు. తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదు. ప్రతిపక్షం సహకరించలేదు.
తోడ్పాటు లేకపోగా అడుగడుగునా అడ్డంకులు పెట్టారు
5వ ఏడాది 10.82% వృద్ది సాధించాం. వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ధి సాధించాం.
పెద్ద ఎత్తున సంపద సృష్టించాం. వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచాం.
స్వాతంత్ర్యం వచ్చాక ఇంత అభివృద్ది జరగలేదు, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కాలేదు
రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం. 30లక్షల ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతున్నాం.
19ప్రాజెక్టులు రైతులకు అంకితం చేశాం. 23ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యింది. మరో 22 ప్రాజెక్టుల్లో శరవేగంగా పనులు. కొత్తగా మరో 14 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం.
రాజధాని అమరావతిలో రూ.50వేల కోట్లతో అభివృద్ధి పనులు.
ఉత్తరాంధ్ర,రాయలసీమ,కోస్తాంధ్ర సమగ్రాభివృద్ది
ఒక సంక్షోభం. ఒక అవకాశం.
ఒక ఆలోచన ఏవిధంగా అభివృద్ధికి బాటలు వేస్తుందో ఏపినే ఉదాహరణ
ల్యాండ్ పూలింగ్ ఆలోచన ఆ విధంగా వచ్చిందే.
పిలుపిచ్చిందే తడవుగా 34వేల ఎకరాలు రైతులు ఇచ్చారు.
రాజధాని నిర్మాణం మొన్నటిదాకా ఒక ఊహ. ఇప్పుడది వాస్తవంగా మారింది.
ఎక్కడ రాజధాని కడతారు..? నిధులు ఎక్కడనుంచి తెస్తారు..? అని అప్పట్లో అందరూ ప్రశ్నించారు
ప్రశ్నించినవాళ్లే ముక్కున వేలేసుకునేలా అభివృద్ది













