టీడీపీలోకి నంద్యాల నేత నౌమాన్
నంద్యాల మునిసిపాలిటీ మాజీ చైర్మన్, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు నౌమాన్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొన్నారు. మంత్రి భూమా అఖిల ప్రియా సమక్షంలో తన కుటంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పనితీరు నచ్చి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానన్నారు. నంద్యాల నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి అవుతోందన్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడం తప్పని జగన్‌కు తాను చెప్పానని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించానని అన్నారు. నన్ను వైసీపీలోకి తీసుకోవాలని శిల్పా మోహన్‌రెడ్డి, జగన్‌లు ప్రయత్నించారు అని అన్నారు. రాయలసీమలో ఇటీవల కాలంలో టీడీపీలో చేరిన మొదటి మైనారిటీ నేత నౌమాన్ కావడం విశేషం.













