శ్రీ బాలాజీ కేక్ వాలా ను ప్రారంభించిన ప్రముఖ సినీ నేపధ్య గాయని సునీత
కర్నూలు నగరంలో సరికొత్త హంగులతో విశాలమైన, మరియు పరిశుభ్రమైన వాతావరణం లో ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ కేక్ వాలా ను ప్రముఖ సినీ నేపధ్య గాయని శ్రీమతి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి సునీత మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలకు మంచి రుచులతో, నాణ్యతతో, బిస్కెట్లు, కేక్స్, డోనట్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ దగ్గర నుండి అన్నీ రకాల బేకరీ ఐటమ్స్ కోసం హైద్రాబాద్ వెళ్ళవలసిన అవసరం లేకుండా కర్నూల్ నగరం లో మంచి రుచులతో నగర ప్రజలకు అందుబాటు లోకి తెచ్చిన కేక్ వాలా యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు, కర్నూలు ప్రజలు ఈ రుచులను ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ బాలజీ కేక్ వాలా యజమాని ముప్పా రాజశేఖర్, కొండలరావు తదితరులు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.













