ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వారది నిర్మాణం…
నరసాపురం – సఖినేటిపల్లి మధ్య వసిష్టా గోదావరి పై నరసాపురం వద్ద వారధి నిర్మించాలన్న ఉభయ గోదావరి ప్రజల చిరకాల స్వప్నం వసిష్టా గోదావరి వంతెన నిర్మాణం యొక్క ఆవశ్యకతను గౌరవనీయ కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ మరియు జాతీయ రహదారుల మంత్రివర్యులు శ్రీ నితిన్ జైరాం గడ్కరిని గారిని గౌరవ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారు, నరసాపురం గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు, అమలాపురం గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ పండుల రవీంద్ర బాబు గారు, కాకినాడ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ తోట నరసింహం గారు, విశాఖపట్నం గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కంభంపాటి హరిబాబు గారు, శ్రీకాకుళం గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, రాజోలు గౌరవ శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు, గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ ఎం.ఎ. షరీఫ్ గారు, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శ్రీ పొత్తూరి రామరాజు గార్లతో కలిసి వివరించారు. వారు సానుకూలంగా స్పదించారని వారు తెలిపారు.













