రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్
గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి వర్సిటీ వేదికగా ఈ పథకాన్ని జగన్ శ్రీకారం చుట్టారు. దీనిద్వారా 54 లక్షల మందికి సాయం అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామన్న ప్రభుత్వం తాజాగా దీనిని రూ.13,500కు పెంచింది. పథకం ప్రారంభం సందర్భంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ చెక్కులు పంపిణీ చేశారు.













