ఏపీ ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక
రిషికొండ తవ్వకాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఉల్లంఘనలు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. పార్లమెంట్లో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. రిషికొండలో తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో కమిటీ నియమించామని తెలిపారు. తవ్వకం పనులతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయాలపైనా కమిటీ పరిశీలించనుందని, ఉల్లంఘనలు జరిగినట్లు కమిటీ విచారణలో తేలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని అశ్వినీకుమార్ చౌబే పేర్కొన్నారు.













