ఏపీ డేటాపై ఎందుకింత రాద్ధాంతం?
ఏపీ డేటాలో విషయం ఏమీ లేకున్నా టీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న వాటిల్లో రహస్య వివరాలు ఉన్నట్తు భావిస్తే మీరు చదివారా? చదివితే తప్పుకదా? అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రహస్య సమాచారం ప్రయివేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీయడంపై రావుల పై విధంగా స్పందించారు. ఒకనాడు దోపిడీదారుగా కనిపించిన జగన్ ఏపీ సీఎం కావాలని టీఆర్ఎస్ నేతలు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.













