ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ ఎన్నికయ్యారు. అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవిప్రసాద్, గూడపాటి వెంకటేశ్వరరావు, జాగర్లమూడి కోటేశ్వరీదేవి పోటీ పడ్డారు. 6 వేలకుపైగా సభ్యులున్న అసోసియేషన్లో 2027 మందికి ఓటు హక్కు ఉంది. ఈ ఎన్నికల్లో రవిప్రసాద్ విజయం వరించింది. ఉపాధ్యక్షునిగా జీఎల్ నాగేశ్వరరావు, కార్యదర్శులుగా, జేయూఎంవీ ప్రసాద్, పి.రాయన్, సంయుక్త కార్యదర్శిగా ఈర్ల సతీశ్ కుమార్, కోశాధికారిగా తోట సునీత ఎన్నికయ్యారు. పలువురు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ప్రత్యేక ఏపీ హైకోర్టు ఏర్పాటైన తరువాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు న్యాయవాదుల సంఘానికి జరిగిన తొలి ఎన్నిక కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.













