భవిష్యత్తులో కూడా అవసరమైతే.. ఏపీకి మరిన్ని నిధులు : రామ్మోహన్ నాయుడు
ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. టీడీపీ ఎంపీలలో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా లేకుండా పోయింది. అమరావతికి రైతులు భూమిలస్తే జగన్ శ్మశానం చేయాలని చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. మా ప్రభుత్వంలో కేంద్రం నుంచి అమరావతికి నిధుల ప్రకటన రావడం సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామనడం చాలా గౌరవం. వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునే బడ్జెట్ ఇది. బడ్జెట్ ద్వారా ఏపీకి నూతన విశ్వాసాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.













