రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం
విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీత వేముగంటి, సురభీ కళాకారుడు ఆర్.నాగేశ్వరరావుకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, డీజీపీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.













