Ram Charan: డైరెక్టర్ ను డిమాండ్ చేస్తున్న రామ్ చరణ్
చిరంజీవి(Chiranjeevi), శ్రీదేవి(Sridevi) కలయికలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా ఆ రోజుల్లో ఎలాంటి సంచనాలు సృష్టించిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. 1990, మే 9న రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ దాన్ని 2డీ, 3డీ వెర్షన్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్వూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్(Ram Charan) ఓ వీడియో ద్వారా టీమ్ తో మాట్లాడుతూ, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో ఆ రింగ్ ఏమైంది? చేప ఏమైంది లాంటి క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలని తాను డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) ను డిమాండ్ చేస్తున్నానన్నాడు. అంటే ఇన్‌డైరెక్ట్ గా చరణ్ ఆ సినిమాకు సీక్వెల్ చేయమని నాగ్ అశ్విన్ ను అడిగినట్టే.
ఎప్పట్నుంచో ఆ సినిమాకు సీక్వెల్ ను రామ్ చరణ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) తో చేయాలని చిరంజీవి, అశ్వినీదత్(Aswini Dutt) అనుకుంటున్నప్పటికీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు(Raghavendra Rao) మాత్రం దానిపై ఆసక్తి చూపడం లేదు. రాఘవేంద్ర రావు ఇంట్రెస్ట్ చూపించకపోయినా అశ్వినీదత్ మాత్రం ఎలాగైనా ఈ సీక్వెల్ ను వర్కవుట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని రామ్ చరణ్ అడిగిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం కల్కి2(Kalki2) వర్క్స్ తో బిజీగా ఉన్న నాగి ఈ సీక్వెల్ ను తీసే ఆలోచన చేస్తాడేమో చూడాలి.













