విజయవాడలో వైభవంగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’
విజయవాడ లో నవరాత్రి సంబరం
ఆధునిక హంగులతో సాంస్కృతిక వైభవాన్ని చాటిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’
ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా దాండియా వేడుకలు నిర్వహించిన వైబ్ ఈవెంట్స్ మరియు లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ ‘వేగా జ్యువెలర్స్’..
వేడుకకు ముఖ్య అతిథిగా హజరైన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు..
బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ అండ్ టీమ్ నృత్య ప్రదర్శనలతో హోరెత్తిన కన్వెన్షన్ హాల్..
డీజేల పాటలు దాండియా ఆటలతో, పంజాబీ ధోల్ వాయిద్యాలతో మారుమోగిన బెజవాడ..
సాంప్రదాయ దాండియా, గర్బా నృత్యాలతో అలరించిన నగర యువత, మహిళలు..
భారతీయ సంస్కృతిని కాపాడుతూ, నగర ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవడానికే ఈ ఉత్సవం మన్న వేగా జ్యువెలర్స్ నిర్వాహకులు నవీన్ వనమా, సుధాకర్ వనమా..
కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ నగరం భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలతో కోలాహలంగా మారిపోయింది. తరం మారినా సాంప్రదాయాల విలువ తగ్గకుండా, నగర ప్రజలను ఏకం చేస్తూ వేగా జ్యువెలర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ విజయవాడ కళాత్మక హృదయాన్ని ఆవిష్కరించింది. సాంప్రదాయ దాండియా, గర్బా నృత్యాలతో పాటు సమకాలీన కళారూపాలను మేళవించి నిర్వహించిన ఈ వేడుక నగర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా సాగింది.
ఈ వేడుకలో విజయవాడ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ అండ్ టీమ్ అద్భుతమైన నృత్య రూపకాలతో స్టేజ్పై అలరించారు. ఒకవైపు సాంప్రదాయ పంజాబీ ధోల్ వాయిద్యాల గంభీర నాదం, మరోవైపు డీజేల సంగీత హోరు కలిసి కన్వెన్షన్ హాల్ను ఒక సరికొత్త లోకంగా మార్చేసాయి. యువత, మహిళలు, కుటుంబ సమేతంగా తరలివచ్చి సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ పండుగ ఉత్సాహాన్ని అంబరానికి చేర్చారు.
గుజరాతీ సంస్కృతికి ప్రతిరూపమైన ఈ దాండియా విజయవాడ వాసులకు అందించినందుకు వేగా జ్యూవెలరీ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నగర వాసులు…రోజంతా ఎదురయ్యే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను ఈ దాండియా ద్వారా పోందామని ఇంతటి చక్కటి కార్యక్రమం ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించాలని కోరారు..
ప్రత్యేక ఆకర్షణ గా సాంప్రదాయ పద్ధతులు
ఉత్సవానికి విచ్చేసిన అతిథులకు సాంప్రదాయ హారతి, తిలకంతో ఘన స్వాగతం పలికారు నిర్వహకులు. బెజవాడ ప్రత్యేక రుచులను అందిస్తూ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, మాక్టైల్ కౌంటర్లు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ఫేస్ పెయింటింగ్, రంగురంగుల గాజుల దుకాణాలు, మ్యాగ్నెటిక్ ఫోటో బూత్, ఆకర్షణీయమైన సెల్ఫీ పాయింట్లు పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేశాయి. సాంప్రదాయాల నేపథ్యంలో నిర్వహించిన పలు పోటీలు వేడుకల్లో మరింత జోష్ నింపాయి.
ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నవీన్ వనమా మాట్లాడుతూ.. “నవరాత్రి అనేది భక్తి, సాంప్రదాయం మరియు అందరూ కలిసి జరుపుకొనే ఒక గొప్ప పండుగ. విజయవాడ ప్రజల కళాభిరుచికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ వనమా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడుతూ, నగర ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే ఈ వేడుకను ఇంత ఘనంగా ప్లాన్ చేశామని, బెజవాడ ప్రజల నుంచి వచ్చిన స్పందన అద్భుతమని కొనియాడారు.
ఆధునిక హంగులు అద్దుకున్నా, మన మూలాలను మరువకుండా విజయవాడ కళా వైభవాన్ని చాటిచెప్పిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ నగరవాసుల గుండెల్లో ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు….








