డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సింధు
బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గొల్లపూడిలో ఏపీ భూపరిపాలన(సీసీఎల్ఏ) కమిషనర్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి జగన్నాథం సమక్షంలో డిప్యూటీ కలెక్టర్గా సింధు సంతకం చేశారు. ఈ సందర్భంగా సింధుకు సీసీఎల్ఏ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఒలింపిక్స్ రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెను డిప్యూటీ కలెక్టర్ నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నియామాక పత్రాన్ని అందజేశారు.













