టీటీడీ చైర్మన్ ఖరారు.. రేపు చంద్రబాబు ప్రకటన
టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైంది. నేడు లేదా రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీటీడీ పాలకమండలి సభ్యులపై కూడా కసరత్తు కొలిక్కి వచ్చింది. చైర్మన్‌తో పాటు సభ్యుల పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు.
కాగా.. పుట్టా సుధాకర్‌యాదవ్ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న సుధాకర్‌యాదవ్ పేరును టీటీడీ చైర్మన్ పదవికి ఖరారు చేశారు.













